కడప: టీడీపీ మహానాడులో సీనియర్ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఆకట్టుకుంది. TDP ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన పథకాలు, అభివృద్ధి, నాడు ప్రారంభించిన పథకాలు.. నేడు చంద్రబాబు నేతృత్వంలో రూపుదిద్దుకున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు ఐఏ ఎన్టీఆర్. మానవసేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేష్‌ని చూస్తుంటే ముచ్చటేస్తోంది.. భళా మనవడా.. భళా అంటూ.. ఎన్టీఆర్ ప్రసంగం సాగింది.