వ్యవసాయ శాఖపై సమీక్ష
NEWS May 28,2025 06:56 am
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించారు.