ఏపీ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని, దీని కారణంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయని, రుతు పవనాల ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ముందు జాగ్రత్తగా హెచ్చరించారు.