ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఆఖరు దశకు చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సూపర్ షో చేసింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్ జితేష్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తన జట్టుకు కీలకమైన విజయాన్ని అందించాడు. 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. లక్నో వేదికగా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది. 70వ మ్యాచ్ ఇఇ. ఎల్ ఎస్ జీని 6 వికెట్ల తేడాతో ఓడించింది. మూడో అత్యధిక రన్స్ వేటను సాగించింది.