పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తిపై పలు కేసుల విషయంలో కొడిమ్యాల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విషయంలో మంగళవారం నిందితున్ని జగిత్యాల కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం కోర్టు ఆవరణలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడతానని వెంట వచ్చిన కానిస్టేబుల్ తో చెప్పి పరారైనట్లు సమాచారం. కోర్టుకు తీసుకొచ్చిన నిందితుడు పరారీ కావడంతో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.