తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
NEWS May 27,2025 05:31 pm
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి పోయాయి. బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 83 వేల 542 మంది దర్శించుకున్నారు. 34 వేల 265 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.09 కోట్లు వచ్చిందని తెలిపారు టీటీడీ ఈవో.