వైరా మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
NEWS May 27,2025 05:03 pm
వైరా మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్ గుండె పోటుతో మంగళవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో కన్ను మూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బిఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బిఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జి గా ఉన్నారు. ఆయన మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు.
పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు.