డంపింగ్ యార్డ్, నర్సరీని పరిశీలన
NEWS May 27,2025 10:05 pm
రెవెన్యూ ACLB మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లతా డంపింగ్ యార్డ్ లోని బయో మైనింగ్ ద్వారా వచ్చే ఎరువు పరిశీలించారు. రేగుంటలోని నర్సరీని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ వర్షాకాలం ప్రజలకు ఇచ్చే రకరకాల పూల మొక్కలను, రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, ఆర్డీవో ఎన్ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్, డిఈ నాగేశ్వరరావు, ఏఈ తిరుపతి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, తదితరులు పాల్గొన్నారు.