హైదరాబాదులో పెద్దింటి కథల కార్యశాల
NEWS May 26,2025 04:59 pm
ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కథకుల కోసం కథల కార్యశాల రేపు ఉదయం రవీంద్ర భారతి మినీ హాల్లో జరగనుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక కార్యదర్శి జేయేష్ రంజన్, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి ముఖ్య అతిథులు. కథలు ఎలా రాయాలి అనే అంశంపై శిక్షణ ఇచ్చే ఈ కార్యశాలలో పెద్దింటి అశోక్ కుమార్ తన అనుభవాలను, సలహాలను ఇస్తారు. రచనలపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.