తనను వేశ్య లాగా చూశారంటూ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. దీనిపై స్పందించారు తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్. హైదరాబాద్ గురించి మిస్ వరల్డ్ పోటీదారులకు చెప్పడానికే స్థానిక నాయకులను వాళ్లతో కూర్చోమన్నామని చెప్పారు. వాళ్లు కూడా మిస్ వరల్డ్ గురించి తెలుసు కోవాలని ఆ నిర్ణయం నేనే తీసుకున్నానని అన్నారు.