మిస్ ఇంగ్లండ చేసిన ఆరోపణలపై కమిటీ
NEWS May 26,2025 08:11 am
హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేసింది మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ. ఆమె చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపాయి. దీంతో విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవాలు ఏమిటో తెలియ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఉన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లను అడిగి పోటీల నిర్వహణ తీరును తెలుసుకోనుంది కమిటీ. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అన్నదానిపై ఆరా తీస్తారు.