పాకిస్తాన్ కు అంత సీన్ లేదు - ఓవైసీ
NEWS May 26,2025 08:08 am
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశం తరపున తన వాయిస్ వినిపించారు. దాయాది పాకిస్తాన్ ను ఏకి పారేశారు. బహ్రెయిన్ లో జరిగిన సమావేశానికి హాజరైన ఎంపీ పాక్ పై నిప్పులు చెరిగారు. భారత్ తలుచుకుంటే 20 నిమిషాల్లో ప్రపంచ పటంలో లేకుండా పోతుందని వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంలో ఉన్న ముస్లింలంతా భారతీయులేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. తాము ఇప్పటి వరకు సహనంతో ఉన్నామని, కానీ అది దాటితే పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.