ఆస్తుల పంపకంపైనే డాడీ డాటర్ ఘర్షణ
NEWS May 26,2025 08:05 am
కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు బయటకు ఆరోపణలు చేసుకుంటూ లోలోపట కలిసే ఉంటున్నాయని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిదన్నారు. కుటుంబ పార్టీ, అవినీతి పార్టీతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కేసీఆర్ కుటుంబంలో కలహాలు ఎందుకు జరుగు తున్నాయో వాళ్లే తేల్చుకోవాలన్నారు. దోచుకున్న ఆస్తులను ఎలా పంచుకోవాలన్న దానిపైనే ఈ డాడీ-డాటర్ ఘర్షణ అంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు కాంగ్రెస్‌కు దగ్గరగా ఉన్న వ్యక్తి.. కవిత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.