ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ దేశానికి రక్షణ కవచంగా ప్రధాని పని చేస్తున్నారని, ఆయన అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ప్రధానిగా ఆయన వందేళ్లు ఉండాలని కోరారు. తన జీవితంలో ఇలాంటి గొప్ప వ్యక్తిని నాయకుడిగా చూస్తానని అనుకోలేదని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తో యావత్ ప్రపంచానికి భారత్ సత్తా ఏమిటో తెలిసి పోయిందన్నారు.