తిరుమలకు రికార్డ్ స్థాయిలో భక్తులు
NEWS May 26,2025 07:25 am
తిరుమల భక్త బాంధవులతో పోటెత్తుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. వేసవి కాలం కావడం, సెలవులు రావడంతో భారీ ఎత్తున తరలి వస్తున్నారు పుణ్య క్షేత్రానికి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్న ప్రసాదాలతో పాటు తాగు నీటిని పంపిణీ చేస్తోంది టీటీడీ. తిరుమలకు రికార్డు స్థాయిలో 90 వేల 211 మంది దర్శించుకున్నారు ఈవో జె. శ్యామల రావు. గత వారం రోజుల నుండి భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.