అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకున్న గుజరాత్ టైటాలన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ . ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 230 రన్స్ టార్గెట్ ముందుంచింది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 147 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో చెన్నై గుజరాత్ ను 83 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టోర్నీ నుంచి విజయంతో వీడ్కోలు పలికింది. మొత్తంగా ధోనీసేన సమిష్టిగా రాణించింది. గుజరాత్ కు ఝలక్ ఇచ్చింది.