తండ్రి కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్
NEWS May 25,2025 03:50 pm
మాజీ మంత్రి కేటీఆర్ హుటా హుటిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. తన తండ్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరిద్దరూ సమావేశం కావడంపై ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవలే తన సోదరి , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ కలకలం రేపింది. తను కీలక అంశాల గురించి ప్రస్తావించింది. ఆమె త్వరలోనే పార్టీ పెట్టనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా కాళేశ్వరం కమిషన్ నోటీసులు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.