తిరుమల భక్త బాంధవులతో కిట కిట
NEWS May 25,2025 11:42 am
తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 90 వేల 211 మంది భక్తులు దర్శించుకున్నారు. 43 వేల 346 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.11 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.