ఎగ్జామినేషన్ సెంటర్లలను పరిశీలించిన ఎస్పీ
NEWS May 25,2025 11:07 am
తిరుపతిలో ఏర్పాటు చేసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలి మినరీ ఎగ్జామినేషన్ సెంటర్లలను పరిశీలించారు ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు. మెటల్ డిటెక్టర్ వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపాలని సిబ్బందికి సూచించారు. మహిళ అభ్యర్థుల బ్యాగులు కూడా చెకింక్ చేయాలన్నారు. ఎగ్జామినేషన్ జరుగుతున్న పరిసర ప్రాంతంలో ఇంటర్నెట్, జిరాక్స్ షాపులు మూసి వేశారా లేదా అన్నది తనిఖీ చేయాలన్నారు . ఎగ్జామినేషన్ పూర్తి అయ్యేంత వరకు డిఎస్పి స్ధాయి అధికారి నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.