కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై క్లారిటీ వచ్చేసింది. తన తండ్రి కేసీఆర్ కు తానే రాశానని చెప్పేసింది. ఈ సందర్బంగా తాను 2 నెలల కిందట రాసిన ఈ ఉత్తరం బయటకు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించింది. పార్టీలో ఉన్న లీకు వీరులు ఎవరో తేలాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై అంతర్గతంగా విచారణ చేపట్టాలన్నారు. ఏది ఏమైనా లేఖ రాయడం తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించింది. అంతే కాదు కేసీఆరే తమ నాయకుడు అని స్పష్టం చేసింది ఎమ్మెల్సీ.