సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రంలోని ఏడుగురు మంత్రులను కలిశారు. ఈ సందర్బంగా దయచేసి అమరావతిని కేపిటల్ సిటీగా గుర్తించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరాడు. లేకపోతే ఇబ్బంది అవుతుందని పేర్కొన్నాడు. ఏపీని గ్రీన్ హబ్ గా మారుస్తామన్నారు. ఇందు కోసం ఆర్థిక సాయం చేయమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరామన్నాడు. ఈ విషయంలో కేంద్రం సపోర్ట్ తనకు సంతోషాన్ని కలిగించిందన్నాడు.