కుల్లూరు అంజన్న సన్నిధిలో టీటీడీ చైర్మన్
NEWS May 23,2025 08:04 am
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు లోని ఆరామ మారుతి నిలయ అభయారణ్య ఆంజనేయ స్వామిని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్థానిక మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్ ఆహ్వానం మేరకు టిటిడి ఛైర్మన్ అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న టిటిడి ఛైర్మన్ కు జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, పలువురు స్థానిక నేతలు స్వాగతం పలికారు.