కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీస్
NEWS May 22,2025 04:06 pm
పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆమెతో పాటు భర్త రాజేందర్ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి భూముల కొనుగోలుపై కోర్టును ఆశ్రయించారు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి. తను ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. 2017 లో తొర్రూరు మండలం గుర్తురులో 75 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందంటూ దావా వేశారు. ఈ మేరకు కోర్టు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, CCLA కమిషనర్, జిల్లా కలెక్టర్, RDO, తహశీల్దార్ లకు సైతం నోటీసులు జారీ చేసింది.