ఎవరూ ఊహించని రీతిలో పాండ్యా సేన దుమ్ము రేపింది. ఏకంగా 18వ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. నువ్వా నేనా సాగుతుందని అనుకున్న ఈ కీలక లీగ్ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే తడపడింది. 18 ఓవర్ల వరకు జస్ట్ ఆ జట్టు చేసిన రన్స్ కేవలం 120 పరుగులు మాత్రమే. కానీ ఆ తర్వాత చివరి 2 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు ఇచ్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఎప్పటి లాగే మరోసారి సూపర్ షో చేశాడు సూర్య కుమార్ యాదవ్. 73 రన్స్ చేశాడు. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 రన్స్ కే పరిమితమైంది. 59 రన్స్ తో ఓటమి పాలైంది.