భక్తులు కిటకిట హుండీ గల గల
NEWS May 22,2025 08:01 am
తిరుముల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 80 వేల 964 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 125 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. భక్తుల క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.