తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది . ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టీపీసీసీ చీఫ్ పై సంచలన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఏడు రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ స్పష్టం చేసింది.