కేటీఆర్ నోటిని యాసిడ్ తో కడుగుతాం
NEWS May 21,2025 03:44 pm
తీరు మార్చుకోకపోతే కేటీఆర్ నోటిని యాసిడ్ తో కడుగుతామని హెచ్చరించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. తనకు పిచ్చి ఎక్కిందని, ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కమీషన్ దందా, లిక్కర్ దందా, కాళేశ్వరం దందా ఇలా అన్ని దందాలు చేసిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఇంకొక్కసారి సీఎం రేవంత్ గురించి, మంత్రుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు.