దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముంబైలో ఇద్దరు ఈ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. మరో వైపు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసుల గురించి స్పందించారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.