కోవిడ్ ఎఫెక్ట్ దేశంలో 164 కేసులు
NEWS May 21,2025 09:25 am
మరోసారి కోవిడ్ పంజా విసురుతోంది. ఇప్పటికే సింగపూర్ , ఆసియాలో కొన్ని చోట్ల కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మే 12 నుండి భారత దేశంలో 164 కేసులు నమోదయ్యాయి. హాంగ్ కాంగ్ లో కూడా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముంబైలో ఇద్దరు మృతి చెందారని వైద్యులు నిర్దారించారు. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తలు పాటించాలని, యధావిధిగా మాస్క్ లు ధరించాలని సూచించింది.