చార్మినార్ అగ్ని ప్రమాదంపై ముగిసిన విచారణ
NEWS May 21,2025 08:17 am
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చార్మినార్ లోని గుల్జార్ హౌస్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన క్లూస్, ఫోరెన్సిక్ బృందం విచారణ చేపట్టింది. గుల్జార్ హౌసులో ప్రమాద కారణాలపై నిర్ధారణకు వచ్చారు. ఇంటి మొత్తంలో 14 ఏసీలు ఉన్నట్లు గుర్తించారు. గ్రౌండ్ ప్లస్ టు అంతస్తుల భవనం మొత్తం తునా తునకలు అయ్యింది. మూడు అంతస్తుల భవనంలో పనికి రాకుండా పోయాయి వస్తువులు.