సింగపూర్ లో ఐసీసీ కీలక సమావేశం
NEWS May 21,2025 08:09 am
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక వార్షిక సమావేశానికి సింగపూర్ వేదిక కానుంది. బీసీసీఐ కార్యదర్శి , ఏసీసీ చైర్మన్ గా ఉన్న జే షా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జూలై 17 నుండి 20వ తేదీ వరకు ఐసీసీ మీటింగ్ జరగనుందని తెలిపింది బీసీసీఐ. జే షా అధ్యక్షతన జరిగే మొదటి ఏజీఎం సమావేశం కావడం విశేషం.