ఐపీఎల్ మ్యాచ్ ల సమయం పొడిగింపు
NEWS May 21,2025 07:44 am
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆఖరు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్ లతో పాటు ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంతో చాలా మ్యాచ్ లకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ లు కొన్ని రద్దవుతుండగా మరికొన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ మ్యాచ్ ల సమయం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2 గంటలు పెంచినట్లు వెల్లడించింది.