పచ్చదనం పరిశుభ్రత భక్తులకు ప్రాధాన్యత
NEWS May 21,2025 07:32 am
తిరుమలలో పచ్చదనం పెంపొందిస్తామని , సామాన్య భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆదాయం అనేది టీటీడీ ప్రాధాన్యత కాదన్నారు. భక్తులకు నాణ్యమైన, సరసమైన ఆహారం విక్రయించే బ్రాండెడ్ సంస్థలకు టెండర్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. గోశాలలో గోవులను మరింత ఆరోగ్యంగా సంరక్షించడంపై చర్యలు చేపట్టామన్నారు. సీఎం ఆదేశాల మేరకు అటవీ శాఖకు రూ. 4 కోట్లు మంజూరు చేశామన్నారు.