స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలు
NEWS May 21,2025 07:17 am
స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలందించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. రిటైర్డ్ ఐఏఎస్ ఐవి సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మేరకు స్విమ్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ విభాగాలకు సంభందించి 597 పోస్టులు భర్తీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీవారి వైద్యసేవ ద్వారా ఆసక్తి ఉన్న వాలంటీర్స్ ద్వారా స్విమ్స్ లో సేవలు ప్రారంభిస్తామన్నారు. టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తామని, .రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించా మన్నారు. మఠాల ఆక్రమణలపై పరిశీలన జరుగుతుందన్నారు.