ఆర్టీఐ కమిషనర్లలో బీసీలకు అన్యాయం
NEWS May 21,2025 07:36 pm
కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఆర్టీఐ కమిషనర్ పదవులలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. భర్తీ చేసిన ఆరు పోస్టులలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రయారిటీ ఇచ్చారని, 60 శాతానికి పైగా ఉన్న బహుజనులను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.