కేసీఆర్ కు నోటీసులు కక్ష సాధింపే
NEWS May 21,2025 06:57 am
కాళేశ్వరం కమిషన్ కాదని అది కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నాయకురాలు రజని సాయిచంద్. బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కు, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది కావాలని సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపుతో తీసుకున్న నిర్ణయం అని ఆరోపించారు. న్యాయం తమ వైపు ఉందని, రైతులు, ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలని ప్రాజెక్టు కట్టారని స్పష్టం చేశారు.