కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతికి 800 మంది సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.