రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. గత ఆగస్టు 2న అనారోగ్యంతో మంచం పట్టిన పిట్ల రామ లక్ష్మి (78) అనే వృద్ధురాలని వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. దీనిపై న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరింది కలెక్టర్ ను. నిర్లక్ష్యంగా తూతూ మంత్రంగా నివేదిక సమర్పించడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది.