ఆస్కార్ అవార్డు పొందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిని ఘనంగా సన్మానించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. హరిహర వీరమల్లు కోసం కీరవాణి చేసిన సలసల పాటను 50 సార్లు విన్నానని చెప్పారు. పౌరుషం తగ్గితే సలసల పాట వింటే శరీరం జలదరిస్తుందన్నారు.