టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి మొదటి నుంచి నమ్మకంగా పని చేసిన వారికే పదవులు ఇవ్వాలని పార్టీని డిమాండ్ చేశారు. లేక పోతే అర్హత లేని వారికి పదవులు ఇస్తే ఊరుకోనని అన్నారు. వాళ్లను ఊళ్లోకి కూడా అడుగు పెట్టనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు భూమా అఖిలప్రియ. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.