కేసీఆర్, హరీశ్, ఈటలకు నోటీసులు
NEWS May 20,2025 01:27 pm
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోషన్ కమిషన్ తరపున నోటీసులు పంపించారు. కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల పని చేశారు. దీంతో ఈ ముగ్గురు విచారణకు రావాలని స్పష్టం చేశారు నోటీసులలో.