మహానాడు నిర్వహణకు 19 కమిటీలు
NEWS May 20,2025 01:02 pm
ఈనెల 27, 28, 29న కడపలో నిర్వహించే టీడీపీ మహానాడు నిర్వహణ కోసం ఆ పార్టీ చీఫ్ , సీఎం చంద్రబాబు నాయుడు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాస్, బక్కని నర్సింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేయగా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు.. యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ ఏర్పాటు.. అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీ.. రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు.