గుల్జార్ హౌస్ ఘటనపై కమిటీ ఏర్పాటు
NEWS May 20,2025 11:24 am
హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. GHMC కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, TSSPDCL సీఎండీ ముషారఫ్‌ను నియమించింది. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్.