11 మందిపై దేశద్రోహం కేసు - కేంద్రం
NEWS May 20,2025 09:11 am
కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశ ద్రోహానికి పాల్పడినట్లు 11 మందిపై అభియోగాలు మోపింది. ఈ మేరకు వారి వివరాలను వెల్లడించింది. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ప్రకటించింది. వీరిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తో పాటు మరో 10 మంది ఉన్నట్లు తెలిపింది. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం విస్తు పోయేలా చేసింది. ప్రకటించిన వారిలో జ్యోతి, దేవేంద్ర సింగ్ దిల్హాన్, తారిఖ్, ఆర్మన్, నౌమన్ ఇలాహి, షహజాద్, మహ్మద్ ముర్తజా అలీ, గజాలా, యామిన్ మొహ్మద్, సుఖ్ ప్రీత్ సింగ్, కరన్ బీర్ సింగ్ ఉన్నారని ప్రకటించింది.