భారత్ లో కొత్తగా 257 కరోనా కేసులు
NEWS May 20,2025 08:36 am
కరోనా భూతం మరోసారి భారత్ ను భయపెడుతోంది. కొత్తగా 257 కేసులు నమోదైనట్లు ప్రకటించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం. అయితే, కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తగా మాస్క్ లు ధరించాలని కోరింది. మరో వైపు మహేష్ మరదలు శిల్పాకు కోవిడ్ సోకింది.