భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ కు చెందిన 64 మంది సైనికులతో పాటు అధికారులు మృతి చెందారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఆపరేషన్ మిషన్ లో 90 మందికి పైగా పాక్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, ఇదే సమయంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న ఉగ్రవాదులను సైతం మట్టు పెట్టామని ప్రకటించింది. భారత్ వైపు పాకిస్తాన్ చూస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.