సిట్ విచారణతో వైసీపీ నేతల్లో గుబులు
NEWS May 20,2025 07:49 am
లిక్కర్ స్కాంపై కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణతో వైసీపీ నేతల్లో భయం నెలకొందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. అందుకే ప్రజలను మభ్య పెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన గత సర్కార్ లో కీలక పాత్ర పోషించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు .కావాలని పుంకాను పుంకాలు అబద్దాలు రాస్తూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని. ధ్వజమెత్తారు. సిట్ దుబాయికి వెళ్లి విచారణ మొదలు పెడితే మాకొద్దు ఈ రాజకీయం అని దోపిడీదారులు పారిపోతారంటూ ఎద్దేవా చేశారు.