నెల్లూరు నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను కూతురు షరిణితో కలిసి పరిశీలించారు మంత్రి పొంగూరు నారాయణ. హైస్కూల్, ఇండోర్ ప్లే ఎక్విప్‌మెంట్ ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంలో మార్పులు చేయాలని ఆదేశించారు. విఆర్సీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి లోకేష్ ఆమోదంతో రూ.15 కోట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభించామన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్కూల్ రూపకల్పన చేశామన్నారు. ప్రతి ఏడాది వెయ్యిమంది చొప్పున ఐదేళ్లలో ఐదు వేల మందికి ఉచితంగా అడ్మిషన్ కల్పించి అన్ని సౌకర్యాలు ఉచితంగా అందిస్తాం.