ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి
NEWS May 19,2025 07:41 am
ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్‌లో తెలుగు వారు ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగుజాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నాని అన్నారు. హైదరాబాద్‌లో కంఠంనేని రవిశంకర్‌కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో పాల్గొన్నారు. డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్‌తో ప్రతి దేశంలో ఉందన్నారు. నేను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకు వెళుతున్నారని అన్నారు.