పాకిస్తాన్ మోసాన్ని ప్రపంచానికి తెలియ చేస్తా
NEWS May 19,2025 07:28 am
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. తాను ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశం కోసం పని చేస్తానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను ఎంఐఎం పార్టీకి ప్రాతినిధ్యం వహించడం లేదని అన్నారు. తాను అఖండ భారతావనికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. భారత్ సాధించిన విజయాల గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి ప్రపంచానికి తెలియ చేసేందుకు వెళతానని స్పష్టం చేశారు.